ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావమున్న రాశులివే.. ఉపశమనం కోసం ఇలా చెయ్యండి
జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు శని దేవుడికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే శని దేవుడు కర్మల ఆధారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు. మంచి పనులు చేస్తే శుభ ఫలితాలను, చెడు పనులు చేస్తే దుష్ఫలితాలను ఇస్తాడు. శని న్యాయానికి అధిపతి. అటువంటి శని కొన్ని రాశుల వారిని సమయానుకూలంగా కటాక్షిస్తాడు కూడా.. ప్రస్తుతం కొన్ని రాశుల వారు ఏలినాటి శని తో బాధపడుతున్నారు.
ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం
ఏలినాటి శని అంటే ప్రజల్లో ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఏలినాటి శని ఉంటే ఏడున్నర సంవత్సరాల పాటు శని తీవ్రమైన ప్రభావం ఆ రాశుల వారి జీవితాల పైన ఉంటుంది. ప్రస్తుతం ఏ ఏ రాశుల వారి జీవితాలపై ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మనం చేయవలసింది ఏమిటి? అనేది తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ఏలినాటి శని 2025 సంవత్సరం మార్చి నెలలో ప్రారంభమైంది. మేషరాశి వారికి దీని ప్రభావం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ప్రస్తుతం మేషరాశిలో ఏలినాటి శని మొదటి దశ కొనసాగుతుంది. 2027 లో రెండవ దశ ప్రారంభమవుతుంది. 2032 నాటికి ఈ రాశి వారు శని ప్రభావం నుంచి బయటపడతారు.
కుంభరాశి
కుంభ రాశి వారు ప్రస్తుతం ఏలినాటి శని మూడవ దశలో ఉన్నారు. ఈ రాశి వారికి 2027 తో ఏలినాటి శని ప్రభావం ముగుస్తుంది. కుంభ రాశికి అధిపతి శని దేవుడు కావడంతో ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
మీన రాశి
ఏలినాటి శని ప్రభావం మీన రాశి వారికి కొనసాగుతుంది. ప్రస్తుతం మీనరాశి వారికి రెండవ దశ ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడి కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. 2029 వరకు ఈ రాశి వారు కష్టాలు ఎదుర్కోక తప్పదు.
ఏలినాటి శని నుండి విముక్తి కోసం ఇలా చెయ్యండి
ఇక ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ ప్రభావం నుండి కొంత బయటపడవచ్చు. ఈ సమయంలో శనికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండాలి. పేదలు, వృద్ధులు, మహిళల విషయంలో సానుకూల దృక్పథంతో ఉండాలి. సాధ్యమైనంత దానధర్మాలు చేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications