2025లో ఏడు రాజయోగాలతో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులివే!
2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాం . ఈ సంవత్సరంలో గ్రహాల కదలికలు అందరి జీవితాల్లోనూ సంచలన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇక జ్యోతిష శాస్త్ర అంచనా ప్రకారం 2025 సంవత్సరం మొత్తంగా ఏకంగా ఏడు రాజ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ యోగాలన్నీ కొత్త వివిధ రాశుల వారి పైన వివిధ రకాలైన ప్రభావాలను చూపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ ఏడు విశేష యోగాలు అదృష్టాన్ని తీసుకువస్తున్నాయి. సంపదల భాగ్యాన్ని కలిగిస్తున్నాయి.
మాలవ్య రాజయోగం
2025 సంవత్సరంలో మాలవ్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారు. శుక్రుడు తన సొంత ఇంట్లో లేదా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది . మాలవ్య రాజయోగం 2025 ఏప్రిల్ నెలలో, నవంబర్ నెలలోనూ ఏర్పడుతుంది. ఈ యోగం వృషభ రాశి, తులా రాశి, మీనరాశి వారికి ప్రయోజనాలను కలిగిస్తుంది. వీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు .కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది

గజకేసరి రాజయోగం
గురువు చంద్రుడు కలిసి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది .2025 మార్చి నెల నుంచి జూలై వరకు ఈ యోగం ప్రభావం ఉంటుంది. మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వారికి ఈ యోగం కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక స్థితి పెరుగుతుంది . ధన లాభం కలుగుతుంది. వీరి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.
లక్ష్మీ యోగం
కుజుడు చంద్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. 2025 సంవత్సరంలో జూన్, నవంబర్ నెలలలో ఇది ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక స్థితి బాగా పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది. మేషం, వృశ్చికం, కర్కాటక రాశి వారికి ఈ యోగం కారణంగా ప్రయోజనాలు కలుగుతాయి.
హంస యోగం
అంతే కాదు బృహస్పతి జాతకంలో ఒకటి, నాలుగు, ఏడు లేదా పదవ ఇంట్లో లేదా ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు హంస యోగం ఏర్పడుతుంది. 2025 మే నుంచి అక్టోబర్ వరకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది. దీని కారణంగా కర్కాటక రాశి, మీనరాశి, ధనుస్సు రాశి వారికి మేలు జరుగుతుంది.
ఈ విశేష యోగాలు కూడా
బుధుడు, కుజుడు, గురుడు శుక్రుడు లేదా శని ఒకటి, నాలుగు, ఏడు లేదా పదవ ఇంట్లో లేదా వాటి ఉచ్చరాశుల్లో ఉన్నప్పుడు పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అలాగే 2025 సంవత్సరంలో శని కారణంగా శశరాజయోగం, కుజుడి కారణంగా రుచక యోగం ఏర్పడతాయి. అంతేకాదు సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు 2025 సంవత్సరంలో బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. 2025 జనవరి, ఫిబ్రవరి, ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో ఏర్పడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications