సూర్యగ్రహణంతో కష్టాలు ఎదుర్కొనే రాశులవారు వీరే!
మానవ జీవితంలో జరిగే అనేక సంఘటనలకు గ్రహాల పరివర్తనకు సంబంధం ఉంటుంది. మార్చి నెలలో సంభవించబోతున్న మొదటి సూర్యగ్రహణం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి 29న చైత్ర అమావాస్యనాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ సూర్య గ్రహణ ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది.
సూర్య గ్రహణంతో వీరికి కష్టాలు
భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకిరణాలు భూమికి చేరుకోలేవు. ఇక సూర్యుడిని చంద్రుడు భూమి అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇక రేపు ఏర్పడనున్న సూర్యగ్రహణం కొన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొందరికి ఈ సూర్యగ్రహణం కారణంగా కష్టాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
సింహ రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. సింహరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక నష్టం జరుగుతుంది. ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదర సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇది వీరికి కష్టకాలం, కనుక జాగ్రత్తగా ఉండాలని సూచన.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో కన్యా రాశి వారు ముఖ్యమైన పనులు మొదలు పెట్టకూడదు. పొరబాటున ఈ సమయంలో ఏదైనా పని చేస్తే కన్యా రాశి వారు కష్టాలను ఎదుర్కోవాలి. అపార్ధాలు, అపోహలు, సమస్యలు కన్యా రాశి వారికి ఈ సమయంలో ఎదురవుతాయి, కనుక జాగ్రత్త.
మీనరాశి
సూర్యగ్రహణం కారణంగా మీనరాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. మీన రాశి వారు సూర్యగ్రహణం కారణంగా గుండె జబ్బులతో బాధపడే అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి జాతకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కష్టాలు, సమస్యల బారి నుండి బయటపడేందుకు ముందు అన్నిటికంటే ధైర్యంగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications