చంద్రగ్రహణం నాడు రాశులవారీగా చెయ్యాల్సిన దానాలు.. ఇవి చేస్తే రాజయోగాలు!
హిందూ పంచాంగం ప్రకారం మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతక కాలం కూడా ప్రారంభమవుతుంది.అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం కనిపించే పరిస్థితి లేదు. అయినప్పటికీ చంద్రగ్రహణం వేళ ఎటువంటి శుభకార్యాలను చేయడానికి ఎవరూ ముందుకు రారు.
చంద్రగ్రహణం.. చెయ్యాల్సిన దానాలు
చంద్రగ్రహణం పట్టిన సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని చేయవలసిన పనులు చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా దానధర్మాలు చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. రాశుల వారీగా కొన్ని పరిహారాలను పాటిస్తే అంతా మంచి జరుగుతుందని రాజయోగాలు కలుగుతాయని చెబుతున్నారు.
మేషరాశి
మేష రాశి వారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి గోధుమలు, పప్పు, ఎర్రని పువ్వులు, చందనం, తదితర వాటిని దానం చేస్తే గ్రహణ దోషం రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి అంటున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ సూక్తం పారాయణం చేసి తెల్లటి వస్తువులను, పదార్థాలను, దుస్తులను దానం చేస్తే పురోగతి లభిస్తుందని చెబుతున్నారు.
మిధున రాశి
మిధున రాశి వారు చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవతా పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి, గ్రహణ కాలంలో గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు, బట్టలు, తదితరాలను దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు చంద్రగ్రహణ కాలంలో అన్నం, పాలు, నెయ్యి, కర్పూరం, తెల్లని పువ్వులు, ముత్యాలు తదితరాలను దానం చేస్తే జీవితంలో పురోగతి వస్తుందని చెబుతున్నారు.
సింహరాశి
చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి గ్రహణ సమయంలో గోధుమలు, ఆవనూనె, ఎర్రని వస్త్రాలను రామ మందిరంలో దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
కన్యారాశి
కన్యా రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శ్రీ గణేశ చాలీసా ను పఠించి, రామ మందిరంలో నెయ్యి, కర్పూరం, జీడిపప్పు, కూరగాయలు, పండ్లు, పూలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల వ్యాపారభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు.
తులారాశి
తులా రాశి వారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరం, పంచదార, నెయ్యి, కూరగాయలు, పండ్లు, పూలు, వస్త్రాలు, గోధుమలు దానం చేస్తే మంచిదని, దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణం సమయంలో సుందరకాండ పారాయణం చేస్తే మంచిదని, గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ, బెల్లం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు, కందిపప్పు వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు చంద్రగ్రహణం వేళ్ళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలని పసుపు రంగులో ఉండే పండ్లు, పువ్వులు, నెయి, గోధుమలు, ఉప్పు, పంచదార, ఆహార ధాన్యాలు తదితర వాటిని దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలని, ఈ సమయంలో నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, జీవితంలో పురోగతి వస్తుందని చెబుతున్నారు.
కుంభరాశి
కుంభ రాశి వారు చంద్రగ్రహణ కాలంలో శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించాలని, చంద్రగ్రహణం తర్వాత బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదార, పండ్లు, పువ్వులు, బట్టలు పంపిణీ చేయాలని చెబుతున్నారు.
మీనరాశి
మీన రాశి వారు చంద్రగ్రహణం సమయంలో విష్ణు చాలీసా లేదా రామాయణ, మహాభారతాలను చదవాలని, పసుపు రంగులో ఉండే పదార్థాలు, పువ్వులు, బట్టలు, దానం చేయాలని ఇలా చేస్తే సంపద పెరుగుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications