మీ చేతిలో నుంచి ఇవి జారకుండా చూసుకోండి.. లేదంటే!!

మన చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడకూడదు. ఒకవేళ పడితే జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా ఏయే వస్తువులు చేతినుంచి జారిపడకూడదో తెలుసుకుందాం. మన జీవితంలో భవిష్యత్తును సూచించే అనేక సంఘటనలు ఎప్పుడూ చోటుచేసుకుంటూనే ఉంటాయి. కాకపోతే మనం వాటిని గమనించం. వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి చేతి నుంచి ఏదైనా వస్తువు కింద పడటం అశుభం అని చెప్పబడింది. చేతిలోనుంచి కింద పడిపోవడమనేది చెడును సూచిస్తుందని చెబుతోంది.

* చేతిలో నుంచి పాలు కింద పడకూడదు. పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని, పాలు చిందించడమంటే ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు అవకాశం ఉంటుంది.

these things never slip from your hands

* చేతిలో నుంచి అకస్మాత్తుగా ఉప్పు పడిపోతే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని అర్థం. వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి చేతిలో నుంచి ఉప్పు పడితే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. శుక్రుడు, చంద్రుడు ఉప్పుతో సంబంధం కలిగి ఉంటారు. ఉప్పు పడిపోవడం పతనానికి నాంది అని గుర్తించుకోవాలని వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది.

* ఒకరి చేతుల నుంచి బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు కిందపడకూడదు. అవి కిందపడితే అన్నపూర్ణ తల్లికి జరిగిన అవమానంగా పరిగణిస్తారు. ఈ సంఘటన ఆ వ్యక్తి జీవితంలో ఆహార కొరతకు దారితీయడంతోపాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది.

* నల్ల మిరియాలు ఆరోగ్యానికి సంబంధించినవి. అవి కింద పడటం అంటే మీకు దగ్గరగా ఉండేవారు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.

* పూజా ఫలకం పడిపోవడం కూడా మంచిదికాదని పురాణాల్లో పేర్కొన్నారు. కుటుంబంలో పెద్ద సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంటుందని, అటువంటి సందర్భాల్లో సంక్షోభాన్ని తొలగించమని భగవంతుడిని ప్రార్థించాలని చెబుతోంది వాస్తు శాస్త్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+