వ్యాధులకు వెల్కమ్ చెప్పే వాస్తు దోషాలు!

వాస్తు శాస్త్రం మానవ జీవిత సౌలభ్యం కోసం మరియు ఆనందం కోసం ఎంతగానో తోడ్పడుతుంది. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం పెట్టుకుంటే ఆ ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి దిక్కుకు ఒక ప్రత్యేకమైన సూచన ఉంటుంది. ఏ దిశలు అనుకూలమైనవి? ఏ దిశలు ప్రతికూలమైనవి? ఏ దిశ నుంచి ఎటువంటి శక్తి వెలువడుతుంది అంటే అనేకవిషయాలు వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి.

వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు పక్కా
ఇక వాస్తు నియమాలు పాటించని ఇంట్లో, వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు వారిని ఎప్పుడూ ఇబ్బంది పెడతాయి. వాస్తు లోపాలు అనేక రకాల రోగాలకు కారణం అవుతాయి. మనం ఇంట్లో ఏ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వెన్నాడుతాయి అనేది మనం ప్రస్తుతం తెలుసుకుందాం.

These Vastu defects may be the reasons for health problems

నీళ్ళ సంబంధిత కార్యాకలాపాలు ఆ దిశలో చెయ్యరాదు
వాస్తు శాస్త్రం అనారోగ్యాన్ని నివారించడానికి, ఇళ్ళలోని వాస్తు దోషాలను నివారించడానికి రూపొందించబడిన అనేక ముఖ్యమైన విషయాలను, మార్గదర్శకాలను కలిగి ఉంది. వాస్తు నియమాల ప్రకారం బావులు లేదా కుళాయిలు వంటి నీటితో సంబంధం ఉన్న ఏదైనా దక్షిణం మరియు పడమర దిశల మధ్య ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. అసలు ఈ దిశలో వాషింగ్ మెషిన్ కానీ వాష్ బేసిన్ కానీ ఏర్పాటు చేయడం కూడా మంచిది కాదని సూచిస్తుంది.

మందులు ఆ దిశలో పెడితే అరిష్టం
అంతేకాదు ఇంట్లో ఏదైనా జబ్బుతో వ్యక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి సంబంధించిన మందులను దక్షిణం వైపు పెట్టడం మంచిది కాదని చెబుతోంది. ఇంట్లో మందులను నిల్వ ఉంచడానికి కూడా వాస్తు ఉంటుందని ఉత్తరం దిశలో లేదా ఈశాన్య దిశలో మందులను పెట్టడం మంచిదని సూచిస్తుంది.

ఈ దిశలలో అవి పెడితే రోగాలు తధ్యం
అంతేకాదు రోగాలతో బాధపడుతున్న వారు మందులు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు మీ ముఖాన్ని అభిముఖంగా పెట్టి తీసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇక ఇన్వెర్టర్ల వంటి పెద్ద పెద్ద పెట్టెలను, బరువు వస్తువులను ఉత్తరం లేదా ఈశాన్యం దిశ వైపు ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉత్తరం లేదా ఈశాన్యం దిశ వైపు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని ఒకవేళ ఆ దిశలలో శుభ్రంగా ఉంచకపోతే వాస్తు దోషం తలెత్తుతుందని ఆ ఇల్లు రోగాలకు నిలయంగా మారుతుందని చెబుతోంది వాస్తు శాస్త్రం

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+