2024లో ఈ రాశులవారిపైనే శనిదేవుడి దయ
జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం సంఖ్య 4 కావడంతో 2024 మొత్తం శని ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ఏడాది పొడవునా రాహుకేతువుల ప్రభావం కూడా ఉంటుంది. చంద్రుడు సింహరాశిలో ఉంటాడు. కొన్ని జాతకాలపై శనిదేవుడి ఆధిపత్యం పెరుగుతుంది. 5 నెలల పాటు శని కొన్ని రాశులపై దుష్ప్రభావాన్ని చూపుతాడు. 2024లో శనిదేవుడివల్ల ఏయే రాశులవారికి మంచి జరుగుతుంది, ఏయే రాశులవారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయనే విషయాలను తెలుసుకుందాం.
ఈ ఏడాది శని కుంభరాశిలో ఉంటాడు. తిరోగమనం వల్ల గురుడు మేషరాశిలో సంచారం చేసి వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. రాహువు మీనరాశిలో ఉంటే, కేతువు కన్యారాశిలో ఉంటాడు. కొన్ని గ్రహాలు ప్రతి నెలా రాశి సంచారం చేస్తుంటాయి. జ్యోతిష్య పండితులు చెబుతున్నదాని ప్రకారం కొన్ని రాశులవారిపై శని ప్రభావం ఉంటుంది. ప్రధానంగా మేష రాశి, మిథున రాశి, కన్యారాశి, ధనుస్సు రాశివారికి శని ప్రత్యేకంగా అనుగ్రహాన్ని అందిస్తుంది. 2024 మొత్తం ఈ రాశులవారు ఊహించని రీతిలో లాభాలను పొందుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటకం తులారాశి, కుంభ రాశి వారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లను వదులుకోవడం చాలా మంచిది. వీటివల్ల ఆరోగ్యాన్ని బాగా సంరక్షించుకున్నవారవుతారు. మార్పులు చేసుకోకపోవడంవల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురవుతుంది. కచ్చితంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటేనే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications