శుక్రుడి గోచారం.. వీరంతా మహర్జాతకులవుతారు

వైభవం, విలాసానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శక్ర గ్రహం ఈరోజు తులా రాశిలో ప్రవేశించనుండటంతో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరి కొన్ని రాశులకు మాత్రం మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రధానంగా మూడు రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. శుక్రుడు ఎప్పుడు రాశి పరివర్తనం చెందినా సంబంధిత రాశుల జీవితాల ఆర్ధిక పరిస్థితిపై కచ్చితంగా ప్రభావం పడుతుంటుంది. శుక్ర గ్రహం ఏ రాశికి అధిపతో అదే రాశిలో ప్రవేశించనున్నాడు. కొన్ని రాశులవారికి దీనివల్ల మహర్దశ పట్టనుంది.

మకర రాశి : విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఇది మంచి అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు, వాటితోపాటు ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో లాభాలున్నాయి. కెరీర్ చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు.

these zodiac sign peopla are very lucky due to Venus Transit 2023

మేష రాశి : భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉండటంతోపాటు కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో అనువైన సమయం గడుపుతారు. కెరీర్, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఉండేవారికి ఎంతో లాభం. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి : పూర్వీకుల నుంచి సంపద లభిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారంలో లాభాలున్నాయి. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ లాంటి వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయం. కొత్త ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవితంలో సుఖసంతోషాలను అనుభవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఇంట్లో పెద్దవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొంతవరకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+