కళాత్మక రాజయోగంతో ధనవంతులవుతున్న రాశులవారు.. మీ రాశి ఉందా?
బుధుడికి ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు కేవలం రెండున్నర రోజుల్లోనే తన రాశిని మారుస్తుంటాడు. ఇలా మారే క్రమంలో వివిధ గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాడు. మనస్సుకు కారకుడైన చంద్రుడు డిసెంబర్ 8 రాత్రి 9:35 గంటలకు తులారాశిలోకి ప్రవేశించాడు. శుక్ర గ్రహం ఇప్పటికే అదే రాశిలో సంచారం చేస్తోంది. తులారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కళాత్మక రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలను కలిగించనుంది. కళాత్మక రాజయోగంతో లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.
తులా రాశి: ఈ రాశిలోనే శుక్రుడు, చంద్రుడి కలయిక ఏర్పడుతోంది. దీనివల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఒకరకంగా గోల్డెన్ డేస్ మొదలైనట్లే. గతంలో మొదలై మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీగా ఆర్డర్లు ఉంటాయి. అదేస్థాయిలో లాభాలను కళ్లచూస్తారు.

కర్కాటక రాశి: కళాత్మక రాజయోగం ఈ రాశివారికి మంచి ప్రయోజనాలను కలిగించనుంది. కర్కాటకరాశికి చంద్రుడు అధిపతి. దీనివల్ల వీరు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
మకర రాశి: వీరు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ మునుపటికంటే ఎంతో బాగుంటుంది. ఎంత శ్రమపడితే అంత ఫలితం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా అభివృద్ధి ఉంటుంది.












Click it and Unblock the Notifications