అక్టోబరు నెలలో వీరి సుడి మాములుగా తిరగడంలేదుగా

హిందూమతంలో జ్యోతిష్యానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాల రాశిచక్రం మార్పువల్ల జీవితంలో మంచి చెడులతో కూడిన పరిణామాలు సంభవిస్తుంటాయి. అక్టోబరు నెల చాలా ప్రత్యేకమైంది. కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఈ నెలలోనే సంచరించబోతున్నాయి. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 8.45 గంటలకు బుధుడు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో అప్పటికే సూర్యుడు అక్కడ ఉండటంవల్ల బుధ, సూర్య గ్రహాలు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఏ రాశిలో ఇది ఏర్పడితే ఆ రాశివారికి తిరుగుండదు. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. ఈ యోగంవల్ల లబ్ధి పొందనున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి : మధ్యలో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. పనిచేసేచోట ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. రచయితలు, జర్నలిజానికి సంబంధించినవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. మేషరాశివారికి బాగా కలిసివస్తుంది. ప్రతి పని విజయవంతమవుతుంది. విదేశాల్లో ఉద్యోగం వస్తుంది. పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి.

these zodiac sign people are very lucky due to bhudaditya rajayoga october 2023

సింహ రాశి : బుధాదిత్య రాజయోగం ప్రభావం వీరిపై అద్భుతంగా ఉంటుంది. ఊహించని లాభంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతుననవారికి శుభవార్తలు అందుతాయి. శ్రమకు లోటులేదు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారం పనిమీద దూరప్రయాణం చేస్తారు.

వృషభ రాశి : ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. భూమి లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

కన్యా రాశి : కన్యా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగంతో ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కెరీర్ మునుపటి కంటే బలపడుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో కలిసి తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ఈ కాలంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు. పనులు పూర్తి చేయగలుగుతారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రజలు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలను పొందుతారు.

ధనస్సు రాశి : అక్టోబర్ నెల వ్యాపారులకు అనువైన సమయం. ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగులకు కూడా ధనలాభం ఉంటుంది. పదోన్నతులు, కోరుకున్నచోటికి బదిలీ, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో సైతం మంచి లాభాలుంటాయి. ఆర్దికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+