లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి కనక వర్షమే
సంపదకు, వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడైన బుధుడు శుభప్రదంగా జాతకంలో ఉంటే ఆ వ్యక్తి పారిశ్రామికవేత్త అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న బుధుడు గత నెల 25న రాశిని మార్చాడు. బుధుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా 5 రాశులవారిపై ధనవర్షం కురిపించే అవకాశం ఉంది.
వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వీరిపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. తెలివితేటలవల్ల లాభపడతారు. మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది.

మిథునరాశి
ఈ రాశివారికి ఈ యోగం అదృష్టాన్ని మోసుకొస్తోంది. బుధుడు మిథునరాశికి అధిపతి. వీరికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. ద్రవ్య ప్రయోజనాలే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. గౌరవం లభిస్తుంది. రచనలతో అనుబంధం ఉన్నవారు ప్రత్యేకంగా లాభపడతారు.
సింహ రాశి
సింహరాశిలోనే ప్రస్తుతం బుధుడు ఉండటంవల్ల వీరికి అంతా అనుకూలంగా ఉంది. నష్టాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలోపేతమవుతారు.
తుల రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వీరికి అదృష్టాన్ని పూర్తిగా అందిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి కనపడుతుంది. సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్నవారు విశేషంగా లాభపడతారు.
కుంభరాశి
వృత్తి, వ్యాపారాల్లో కుంభరాశివారు లాభపడతారు. ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ప్రేమ జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో అత్యంత అనుకూలంగా ఉంటారు. సంతానం లేనివారు సంతానాన్ని పొందుతారు.












Click it and Unblock the Notifications