సంక్రాంతి నుంచి ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించడాన్ని సంక్రమణం అంటారు. ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రాశి పేరున సంక్రాంతి అని పిలుస్తారు. 2024 జనవరి 15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేకంగా అదృష్టం తోడుంటుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
సూర్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తుంటుంది. 2024 జనవరిలో మకర సంక్రాంతి రోజు సంచరిస్తాడు. 15న ధనుస్సు నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి అంటే.. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడం అనే అర్థం వస్తుంది. సూర్యుడు మకర రాశిలో సంచరిస్తుండటంతో ఈ రోజును మకర సంక్రాంతిగా పరిగణిస్తారు. మకరరాశిలో సూర్యుడి సంచార ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

మేషరాశి : ఈ రాశివారు విజయాలు సాధిస్తారు. కెరీర్ లో మంచి అవకాశాలు పొందడమే కాకుండా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
వృషభ రాశి : వీరికి అదృష్టం తోడుంటుంది. పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
సింహరాశి : పట్టుదలతో పనిచేసి విజయాలు సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి.
వృశ్చికరాశి : ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. ప్రమోషన్లు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం వెల్లివిరుస్తుంది. అనుబంధం బలోపేతమవుతుంది.
మీనరాశి : కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్లను ఉద్యోగస్తులు పొందుతారు. ఈ రాశివారికి ఆర్థికంగా పలు లాభాలను పొందుతారు.












Click it and Unblock the Notifications