బుధుడి ఉదయం.. ఈ రాశులవారికి ‘ధనోదయం’
గ్రహాలు కాలనుగుణంగా సంచరిస్తుంటాయి. అంతేకాదు.. పెరుగుతూ ఉంటాయి.. అస్తమిస్తూ ఉంటాయి. ఈ ప్రభావం మానవ జీవితంమీద, భూమిమీద కూడా పడుతుంది. సెప్టెంబరు నెల ప్రారంభంలో బుధుడు పెరగబోతున్నాడు. వ్యాపారాన్ని, మేథస్సును, తెలివితేటలకు కారకుడయ్యే బుధుడు పెరగడంవల్ల కొన్ని రాశులవారికి బాగా కలిసి రానుంది. ఆకస్మిక ధనలాభంతోపాటు కెరీర్ పరంగా పురోగతి పొందుతారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
సింహ రాశి : బుధుడు పెరగడమనేది సింహరాశివారికి బాగుంటుంది. లగ్న గృహంలో ఉయించడనుండటంవల్ల వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ముందస్తు ప్రణాళికల ప్రకారం విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. బుధుడు సంపద, ఆదాయానికి అధిపతి. ఈ సమయంలో వీరి అదాయం పెరుగుతుంది. వేరేవారిదగ్గర చిక్కుకుపోయిన డబ్బును అందుకుంటారు.

మేష రాశి : బుధుడి ఉదయం వీరికి ఎంతో ప్రయోజనకరం. సంచార జాతకంలో ఐదో ఇంట్లో ఉదయించబోతోంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఒంటరి వ్యక్తులు ఈ కాలంలో ప్రత్యేక వ్యక్తులను కలుసుకుంటారు. విద్యార్థులు ఏ కోర్సులోనైనా అడ్మిషన్ తీసుకోవచ్చు.
ధనుస్సు రాశి : ఈ రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి నుంచి తొమ్మిదో ఇంటిపై బుధుడు ఉదయించబోతున్నాడు. అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది. గతంలో ప్రారంభమైన ఆగిపోయిన పనులు తాజాగా పూర్తవుతాయి. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.మతపరమైన పనులపై ఆసక్తి కలుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక కూడా నెరవేరుతుంది.












Click it and Unblock the Notifications