ఈరోజుతో సమయం ముగిసింది.. రేపటి నుంచి మీరే రాజు.. మీరే మంత్రి!
జ్యోతిష్యంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారికి సమాజంలో గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం సింహరాశిలో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. సెప్టెంబరు 16న బుధుడు నేరుగా నడవబోతున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
సింహరాశి : సింహరాశిలో బుధుడు నేరుగా సంచరిస్తాడు. ఈ సమయంలో జాతకస్తులు తీసుకునే నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. అన్ని సమస్యల నుండి బయటపడటమే కాకుండా ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలవల్ల కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, పారాల్లో లాభపడతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

ధనుస్సు రాశి : అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కెరీర్ లో ముందుకు సాగడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బలవంతులవడంతో కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది. ఏ పని చేపట్టినా పట్టుదలతో పూర్తయ్యే వరకు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కుటుంబంతోపాటు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.
మిధునరాశి : బుధుడి ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి బాగుంటుంది. కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిచండంతోపాటు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. అదే సమయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం. అలాగే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications