ఈనెల 10న అత్యంత అరుదైన యోగం.. వీరి దశ తిరిగినట్లే
రవి పుష్య నక్షత్రం అనేది అత్యంత ఫలవంతమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. పుష్య నక్షత్రం ఆదివారం లేదా గురువారం వచ్చినప్పుడు ఎంతో శుభప్రదం. అత్యంత అరుదైన యోగం ఇది. ఈనెల 10న రవి పుష్య యోగం ఏర్పడుతోంది. అజ ఏకాదశి కూడా అదేరోజు వస్తోంది. ఆరోజు బంగారం లేదంటే వెండి, వాహనం, ఇల్లు, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం చాలా మంచిది.
కొన్ని రాశిచక్ర గుర్తులు అదేరోజు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పుష్య నక్షత్రం ఎనిమిదో స్థానంలో వస్తుంది. అమరత్వానికి సూచిక. జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 5.06 గంటల నుండి రవి పుష్య యోగం ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6.15 గంటల వరకు కొనసాగుతుంది.

మిథున రాశి
రవి పుష్య నక్షత్రం ఈ రాశివారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అదృష్టం తోడుంటుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రతి రంగంలోను విజయం వరిస్తుంది. దీనివల్ల పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితిలో ఏదైనా పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారు.
సింహ రాశి
సూర్యుడు మొదటి ఇంట్లో ఉంటాడు. సంపద వృద్ధి చెందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో చేయడం ఎంతో మంచిది. వాహనం లేదంటే ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కల కూడా నెరవేరుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.
తులా రాశి
కుటుంబ సభ్యులతో గడిపేందుకు అధిక సమయం వెచ్చిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ తిరిగి మొదలవుతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారంలో పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.












Click it and Unblock the Notifications