అక్టోబరు నెల మొత్తం వీరిపై కనక వర్షం
జీవితానికి సంపదను, శ్రేయస్సును ఇచ్చేది శుక్రుడు. అక్టోబరు 2వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించబోతుండటంవల్ల మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి సమాజంలో గౌరవ, మర్యాదలు ఇనుమడిస్తాయి. బలహీనంగా ఉంటే వ్యక్తి ఆనందం తగ్గుతుంది. కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు వచ్చేనెల రెండోతేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మూడు రాశులవారికి ఆదాయంతో పాటు అదృష్టం కలుగుతుంది. అక్టోబరు నెల మొత్తం వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఏయే రాశులవారికి కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి : ఈ రాశివారికి మాతృదేవత దుర్గా మాత. జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఈ రాశులవారికి సుఖాలు, సౌకర్యాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. పాలక గ్రహం బృహస్పతి కావడంతో ఇబ్బందులు తలెత్తవు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

సింహ రాశి : కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు తిరిగి మొదలవుతాయి. శుక్రుడి సంచారం వల్ల ఒక్కసారిగా లాటరీ తగిలినట్లుగా ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు సంబంధాలు వస్తాయి. చేసే ప్రయాణం కూడా లాభసాటిగా ఉంటుంది.
తుల రాశి : విశేషమైన ఆనందాన్ని పొందుతారు. ఫలితాలు బాగుంటాయి. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా కలిసివస్తుంది. ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. తద్వారా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. శుక్రుడి సంచారం వీరికి విశేషమైన ఫలితాలను తెస్తుంది.












Click it and Unblock the Notifications