ఈ రాశులపై సంక్రాంతి నుంచి నెలరోజులు కనక వర్షం
గ్రహాలు ఒక నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇలా చేయడాన్ని రాశి సంచారం అంటారు. ఈ క్రమంలోనే కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి నుంచి కొన్ని రాశులవారికి అదృష్టం తోడుంటుంది. ఏయే రాశులవారు అనే వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి:ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే సింహరాశివారిపై సూర్యుడి కరుణ ఎప్పుడూ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కెరీర్ చాలా బాగుండబోతోంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు.

వృషభరాశి:సంక్రాంతిరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశాల్లో ఆస్తిని కొనుగోలు చేస్తారు. కెరీర్ లో పురోగతి ఉంది. మంచి ప్యాకేజ్ తో ఉద్యోగాన్ని సాధిస్తారు. తద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఈ సమయంలోనే పొందుతారు.
ధనుస్సురాశి:ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కెరీర్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. ఆదాయం పెరుగడంతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు.
మీనరాశి:సూర్యుడి రాశి మార్పు వీరికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. కెరీర్ బాగుండటంతోపాటు డబ్బును సంపాదిస్తారు. సంపాదించిన డబ్బును మంచిగా పొదుపు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.












Click it and Unblock the Notifications