సెప్టెంబరు 17 వరకు ఈ రాశులవారికి ఎదురే లేదు

గ్రహాల రాజు సూర్య దేవుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు. ఇందులో భాగంగా సెప్టెంబరు 17వ తేదీ వరకు సింహరాశిలో ఉంటాడు. ఈ క్రమంలో సూర్యుడి రాశి మార్పు ప్రధానంగా మూడు రాశుల వారిపై ప్రభావం చూపనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశివారికి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. బిజీ బిజీగా ఉంటారు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.

these zodiac sign people are very lucky due to surya gochar

వృషభ రాశి : సెప్టెంబరు 17వ తేదీ వరకు వీరికి ఎదురే లేదు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమస్యలన్నీ తొలగిపోవడంతోపాటు చేతికి డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం పటిష్టమవుతుంది. పనిచేస్తున్న చోట మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకోవాలి. మితంగా మాట్లాడితే మంచిది. దీనివల్ల అంతా కలిసివస్తుంది.

సింహరాశి: గతంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవడంద్వారా వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సమయంలో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతర మార్గాల్లో కూడా ఆదాయం వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనితీరుకు అందరినుంచి ప్రశంసలు వస్తాయి.

తులారాశి: తులా రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణం బాగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. దీనివల్ల వారి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామికి చెప్పి చేయడంవల్ల పనులన్నీ విజయవంతమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+