నవంబరు నెలలో ఈ రాశులవారే మహారాజులు
జ్యోతిష్యంలో ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా పిలుస్తారు. సంపద, లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ కు కారకుడిగా భావిస్తారు. ఐశ్వర్యాన్నిచ్చే శుక్రుడు నవంబరు 3న సింహరాశిని వదిలి కన్యారాశికి ప్రవేశించనున్నాడు. దీపావళికి ముందు శుక్రుడు రాశిని మార్చడంవల్ల కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ధన త్రయోదశికి పెద్ద మొత్తంలో ధనాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
వృషభరాశి : నవంబరులో వృషభ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్ లో ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది. అనంతరం వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

మేషరాశి : జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యగాన్ని పొందుతారు. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగం మారాలని చూసేవారికి ఇది అనువైన సమయం. పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో సపోర్టు దొరకుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు.
మిథునరాశి : ఈ రాశులవారికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికి ఇది అనువైన సమయం. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంకంటే బాగుంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
తులారాశి : శుక్రుడి సంచారం వీరికి బాగా కలిసివస్తుంది. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి దక్కుతుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతిని పొందుతారు. కోరికలు నెరవేరతాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications