ఈ నెలలోనే దరిద్ర యోగం, ఖప్పర్ యోగం.. ఈ రాశులవారికి అంతా దరిద్రమే
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలనుగుణంగా తమ రాశులను మారుస్తుంటాయి. దీనివల్ల కొన్ని శుభయోగాలు, మరికొన్ని అశుభ యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు నెలలో గ్రహాల గమనంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న మాసం శ్రావణం. ఇది దాదాపుగా రెండు నెలలు ఉండబోతోంది. ఈ నెలలో సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల రెండు అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిని దరిద్ర యోగం, ఖప్పర్ యోగం అంటారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు వీటివల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కన్యారాశి, ధనుస్సు రాశి, మిథునరాశివారు అప్రమత్తంగా ఉండాలి.
కన్యా రాశి : సూర్యుడు చేస్తున్న అశుభ కర యోగాలు కన్యారాశి వారిపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పనిచేసే చోట ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. దేంట్లోనైనా డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి చేయాలి. కుటుంబ సభ్యులతోపాటు జీవిత భాగస్వామి సలహా తీసుకొని ఆచరించాలి. అనారోగ్యం కలుగుతుంది. వైద్యం కోసం డబ్బులు ఖర్చవుతాయి. మంచి డైట్ ఫాలో అయితే అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు.

ధనుస్సు రాశి : వీరికి అసలు కలిసిరాదు. వీరి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుాయి. కొత్త పని చేయాలన్నా, లేదంటే వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలన్నా మానుకోవడం ఉత్తమం. ప్రస్తుతం చేయకుండా ఉంటే చాలు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో వాహనాలను నడపకుండా ఉంటేనే మంచిది. ఏ పనిని ప్రారంభించినా లేదంటే తలపెట్టినా అన్నీ అడ్డంకులే ఎదురవుతుంటాయి.
మిథునరాశి : ఈ రాశివారిపై దరిద్ర యోగం ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది. ప్రధానంగా వీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా ఉండదు. సహోద్యోగుల నుంచికానీ, పై అధికారుల నుంచి కానీ ఎట్టి సహకారం అందదు. కుటుంబంలో గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. సాధ్యమైనంతవరకు మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. లేదంటే మాట తీరువల్ల మరిన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications