గజలక్ష్మి మహారాజ యోగంతో 2025లో వీరు కుబేరులు కాబోతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశులవారి పైన ప్రభావం పడుతుంది. సంవత్సరమంతా ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశులవారి జీవితాలను మారుస్తుంది. ఇక దేవ గురువు అయిన బృహస్పతి సంవత్సర కాలం ఒకే రాశిలో సంచరిస్తారు. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. మిధున రాశి లోకి ప్రవేశించబోతున్నాడు. మిధున రాశిలో బృహస్పతి ప్రవేశంతో అత్యంత శక్తివంతమైన గజలక్ష్మీ మహారాజ యోగం ఏర్పడబోతోంది.
శుక్రుడు బృహస్పతి సంయోగం కారణంగా గజలక్ష్మి మహారాజ యోగం
గజలక్ష్మి మహారాజ యోగం దాదాపు 12ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ 2025 వ సంవత్సరంలో శుక్రుడు బృహస్పతి సంయోగం కారణంగా ఏర్పడబోతోంది. గజలక్ష్మి మహారాజ యోగం హిందూ క్యాలెండర్ ప్రకారం మే 14 2025సంవత్సరంలో ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి . 2025సంవత్సరంలో గజలక్ష్మి మహారాజ యోగంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి లోనే బృహస్పతి శుక్రుడు కలయిక కారణంగా గజలక్ష్మి మహారాజ యోగం ఏర్పడుతుంది .ఈ కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారి పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కోరిక తీరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కర్కాటక రాశి
గజలక్ష్మి మహారాజ యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శుక్రుడు బృహస్పతి కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి సమస్యలన్నీ తొలగిపోయి సంపదలు వచ్చి పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పైన కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో కర్కాటకరాశి వారికి సంతోషం, సంపద రెండు పెరుగుతాయి. మతపరమైన కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకుంటారు.
ధనుస్సు రాశి
గజలక్ష్మి మహారాజ యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అంతా మంచే జరుగుతుంది. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. జీవితంలో సంతోషం వెల్లి విరుస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్ధికంగా లబ్ధి చేకూరుతుంది. మానసికంగాను ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు సంతోషంగా ఉంటారు. ఇది ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications