మకర రాశిలో శుక్రుడు.. తీవ్రంగా నష్టపోనున్న ఈ రాశులవారు
అష్టగ్రహాల్లో ఒకరైన శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని, కళలను ఇచ్చే శుక్రుడు ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున 4.41 గంటలకు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. వృషభరాశికి, తులారాశికి ఇతను అధిపతి. ఇలా శుక్రుడి గమనంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని రాశులవారు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోబోతున్నట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
శుక్రుడి సంచారంవల్ల ఈ రాశివారు లగ్జరీ జీవితానికి దూరమవుతారు. కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి మద్దతు లభించదు. ఒంటరిగా మిగిలిపోతారు. కార్యాలయాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లావాదేవీలు జరిగే సమయంలో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలను చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. భగవంతుణ్ని పూజించడం, వేడుకోవడం ఒక్కటే పరిష్కారం.

మిథున రాశి
శుక్రుడు మకర రాశిలో సంచారం చేయడంవల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు కార్యాలయంలో యజమానుల చేత మాటలు పడాల్సి ఉంటుంది. పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. కెరీర్ లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులకు నష్టాలున్నాయి. ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఆర్థికంగా క్షీణిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
శుక్రుడి సంచారం ఈ రాశివారిపై పూర్తి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తీసుకునే ఏ నిర్ణయాలు కలిసిరావు. పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు.












Click it and Unblock the Notifications