జూన్ 3 నుంచి ఈ రాశులకు అపారమైన సంపద రాబోతోంది
గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. వ్యక్తుల జాతకాల ప్రకారం కొన్నిసార్లు మంచి, మరికొన్నిసార్లు చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ నెలలో 4 ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. నక్షత్రాల పరంగా కూడా జూన్ చాలా ప్రత్యేకమైన నెల. కొన్ని రాశులవారి జీవితం జూన్ నెలలో పూర్తిగా మారిపోబోతోంది.
జూన్ రెండోతేదీన అంగారకుడు మేషరాశిలోకి సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడితో ఆకర్షణీయమైన రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుుడు జూన్ 12న మిథునరాశిలోకి ప్రవేశించడంవల్ల శుక్ర సంచారం ప్రత్యేకంగా ఉండబోతోంది. జూన్ 14న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే సూర్యుడు 15వ తేదీన ఇదే రాశిలోకి వస్తాడు. ఆరోజు మిథున సంక్రాంతి వస్తుంది.

మేషరాశి
ఈ రాశివారి వృత్తి, వ్యాపారాలు మెరుగుపడతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పిల్లలవైపు నుంచి ఒక శుభవార్తను వింటారు. కెరీర్ లో విజయం సాధించడంతోపాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. తండ్రికి సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త స్నేహితులను కలుస్తారు.
సింహ రాశి
కొన్ని మంచి పనులు చేస్తారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని తండ్రి సహాయంగా దిగ్విజయంగా పట్టాలెక్కిస్తారు. దీనివల్ల మీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది. కొత్త ఆదాయ వనరులు వస్తాయి. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications