తిరోగమనంలో బృహస్పతి... ఈ రాశులకు భారీగా ధనలాభం
జ్యోతిష్యం ప్రకారం గురుడు తన రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి ఏడాది సమయం పడుతుంది. ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న బృహస్పతి రాబోయే 11 నెలలు ఇక్కడే సంచారం చేస్తుంది. ఈనెల ఏడోతేదీన గురుడు తిరోగమనం చెందాడు. దీనివల్ల కొంత అశుభ సమయం ప్రారంభమైంది. అన్నిరకాల శుభకార్యాలు నిలిచిపోతాయి. కొన్ని రాశలవారికి శుభ ఫలితాలు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి. గురుడు తిరోగమనం కారణంగా ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఊహించనిరీతిలో ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. వేతనాలు కూడా పెరుగుతాయి. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు దక్కుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కలుగుతాయి. పెళ్లికానివారికి వివాహం కుదురుతుంది.పెళ్లయిన భార్యాభర్తల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.

కర్కాటక రాశి
అదృష్టం రెట్టింపు అవుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు చక్కబడతాయి. కెరీర్ కు సంబంధించిన విషయాల్లోవ లాభాలున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఇది మంచి సమయం.
సింహరాశి
పాత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మార్పు వస్తుంది. వేతనం పెరిగి ప్రమోషన్ లభిస్తుంది. నిరుద్యోగులకు ఇది మంచి సమయం. వారికి ఉద్యోగాలు వస్తాయి. కోరుకున్న కాకపోయినా మంచి కంపెనీల్లోనే ఉద్యోగాలు పొందుతారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆదాయంలో మార్పులుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. జీవితం ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.












Click it and Unblock the Notifications