గ్రహ సంచారంతో ఈ రాశులవారు కోటీశ్వరులు అవుతారు
జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారాలవల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. జీవితం కూడా ఊహించనిరీతిలో మలుపులు తిరిగే అవకాశం ఉంది. బుధుడు, గురుడు, శుక్రుడు శుభస్థానాల్లో సంచరిస్తున్నారు. దీనివల్ల ఈ నెలాఖరులోగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరియనుంది. ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లడంతోపాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు. ఏ రాశివారికి ఏ విధంగా కలిసివస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశిలో గురువు ఉన్నాడు. బుధుడు, శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ధనధాన్యాలకు లోటు లేదు. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల్లో పలుకుబడి పెరగడంతోపాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది.

మిథునం
ఈ రాశిలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. దీనివల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మనశ్శాంతి దొరుకుతుంది. గురువు వ్యయస్థానంలో ఉండటంవల్ల శుభకార్యాలు, విహారయాత్రలకు ఖర్చు ఎక్కువగా పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి పని సవ్యంగా జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలను వింటారు.
సింహం
లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నాడు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తులు పెరుగుతాయి. ఇంటి, వాహన యోగాలున్నాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. కీర్తి, ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.
కన్య
దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, భాగ్య స్థానంలో గురుడు సంచరిస్తున్నారు. దీనివల్ల పెండింగ్ లో ఉన్న శుభకార్యాలు జరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళతారు. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు, వాహన యోగం ఉండటంతోపాటు కోరుకున్న సంబంధం కూడా కుదురుతుంది.
తుల
ఏ కార్యం తలపెట్టిన ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. భాగ్య స్థానంలో శుభ గ్రహాలు సంచరిస్తున్నాయి. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆస్తి కలిసివస్తుంది. విదేశీ ప్రయాణాలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
ధనుస్సు
ఈ రాశివారు భాగ్యవంతులవుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో దంపతుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. విహార యాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications