నవంబర్ ౩ వరకు వీరికి సంపదల వర్షం, రాజభోగం ప్రకటించిన కుజుడు

గ్రహాలలో కుజ గ్రహాన్ని అత్యంత కీలకమైందిగా, అత్యంత శుభప్రదం అయిందిగా భావిస్తారు. కుజగ్రహ గోచారం ప్రతి ఒక్కరి జాతకంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. సెప్టెంబర్ నాలుగవ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభించారు. నవంబర్ మూడవ తేదీ వరకు కర్కాటక రాశిలోనే కుజుడు సంచరిస్తాడు.

కర్కాటక రాశిలో కుజుడు
ఆపై డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 6వ తేదీ 2025 వరకు సింహరాశిలో, ఆ తర్వాత జనవరి 6వ తేదీ నుండి ఫిబ్రవరి 23 2025 వరకు తిరిగి కర్కాటక రాశిలోకి తిరోగమనం చెందుతాడు. అంతేకాదు ఆ తర్వాత ఏప్రిల్ 18 2025 వరకు కర్కాటకరాశి లోనే కుజుడు సంచరిస్తాడు. కర్కాటకరాశిలో కుజసంచారం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These zodiac signs get wealth royal life with mars transit into cancer

వృషభ రాశి
కర్కాటక రాశిలో కుజ సంచారం కారణంగా వృషభ రాశి వారి జీవితం బాగుంటుంది. ఈ సమయంలో సామాజికంగా యాక్టివ్ గా ఉండటమే కాకుండా సన్నిహితులు బంధువులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీలో నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి ఈ సమయం బాగా తోడ్పాటు అందిస్తుంది. ఇతర ప్రాంతాలకు పర్యటించడానికి కూడా ఇదే మంచి సమయం.

మిధున రాశి
కర్కాటక రాశిలో కుజ సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. గతంలో కంటే ఇప్పుడే మిధున రాశి జాతకుల జీవితం బాగుంటుంది. అయితే మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఖర్చు చేసే విషయంలో బడ్జెట్ ను రూపొందించుకోవడం ముఖ్యమని సూచించబడింది.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో కుజ సంచారం కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రణాళికలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైన సమయం. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కన్యారాశి
కన్యారాశి జాతకులకు కుజ సంచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో కన్య రాశి జాతకులు మీ నెట్వర్ ను విస్తరించడానికి అవకాశం ఉంది. ఈ సమయంలో చురుగ్గా పనిచేస్తారు. కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఆర్థికంగా ప్రయోజనాన్ని ఇస్తాయి. మీ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు. అయితే అంతే మొత్తంలో కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+