దసరా నవరాత్రులలో మహాభాగ్య యోగంతో వీరికి మహా అదృష్టం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో సంయోగం చెందడం వల్ల అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి. ఇక ఈ సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 13వ తేదీన కుజుడు తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. సెప్టెంబర్ 24వ తేదీన నవరాత్రుల సమయంలో చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
మహాభాగ్య యోగం.. అదృష్ట రాశులు
సెప్టెంబరు 26 వరకు చంద్రుడు తులా రాశి లోనే సంచారం చేస్తాడు. ఇక కుజ చంద్రుల కలయికతో మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. మహా భాగ్య యోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. మహాభాగ్య యోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సింహ రాశి వారికి మహాభాగ్య యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. కుజ చంద్రుల సంయోగం వీరికి ఉద్యోగంలో పురోగతిని ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో జీవితానికి ఉపయోగపడే పెద్ద నిర్ణయాలను తీసుకుని విజయాన్ని సాధిస్తారు. సింహ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది.
తులారాశి
తులా రాశి వారికి మహాభాగ్య యోగం ఊహించని ప్రయోజనాలను ఇస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో సకల సౌకర్యాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది తులా రాశి జాతకులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వం వస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి మహాభాగ్య యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా జీవిస్తారు. మకర రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. ఆర్థికపరంగా వీరికి ఈ సమయంలో కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో సక్సెస్ ని అందుకుంటారు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications