వచ్చేనెలలో రెండు యోగాలు.. ఈ రాశులపై కనక వర్షం
గ్రహాల సంచారానికి ఫిబ్రవరి నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు సంచారం చేయబోతున్నాయి. ఫిబ్రవరి 1న బుధుడు, మకరరాశికి, ఫిబ్రవరి 5న కుజుడు మకరరాశికి, 12న శుక్రుడు మకరరాశికి, 13న సూర్యదేవుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాయి.
దీనివల్ల బుధాదిత్య రాజయోగంతోపాటు ఆదిత్య మంగళ యోగం ఏర్పడతాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి విశేషంగా కలిసిరానున్నట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి స్వాంతన లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు శృంగారాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో మంచి విజయం సాధించడమే కాకుండా పేరు తెచ్చుకుంటారు.
కన్య రాశి: కెరీర్ లో విజయాలు సాధించడంతోపాటు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటారు. విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధించడంతోపాటు ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు.
తుల రాశి: ఈ రాశివారి జీవితంలో వ్యక్తిగతంగా మార్పులు చోటుచేసుకుంటాయి. స్నేహితుల సహకారంతో ఆటంకాలన్నీ పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ప్రేమ జీవితంలో శృంగారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications