2026లో శని, శుక్రుల కలయికతో వీరికి దశ తిరుగుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయం తెలిసిందే. ఇక 2026 లో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను మార్చబోతోంది. 2026 లో కొన్ని ముఖ్య గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. 2026 సంవత్సరంలో మీన రాశిలో శని శుక్రుల కలయిక చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది.
మీనరాశిలో శని శుక్రుల కలయిక
ఈ కొత్త ఏడాది అనేక గ్రహాలు రాశులను మార్చడం, కొన్ని గ్రహాలతో సంయోగం చెందడం, తిరోగమనం చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. 2026 మార్చి రెండవ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అప్పటికే మీనరాశిలో సంచారం చేస్తున్న శనితో కలిసి శుక్రుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. మీన రాశిలో శని శుక్రుల కలయిక కారణంగా అదృష్టవంతులు అయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
శని, శుక్రుల కలయిక కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. వివిధ వ్యాపారాలలో మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిధున రాశి
శని, శుక్రుల కలయిక కారణంగా 2026 సంవత్సరంలో మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి శుభ ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు శుభవార్తలను వింటారు. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
మీన రాశి
మీనరాశిలో శుక్ర శని సంయోగం మీన రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకు రాబోతుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. స్థానికులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications