ఈ రాశులకు ఎంతో శక్తివంతమైన యోగాన్ని ప్రసాదిస్తున్న శుక్రుడు
జ్యోతిష్య శాస్త్రంప్రకారం సంతోషానికి, నాయకత్వ లక్షణాలకు కారకుడైన సూర్యుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో భానుడు శుభస్థానంలో ఉంటే ఊహించనిరీతిలో లాభాలు కలుగుతాయి. త్వరలోనే కన్యారాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు అప్పటికే ఆ రాశిలో ఉన్న శుక్రుడితో కలుస్తాడు. ఈ రెండు గ్రహాలు కన్యారాశిలో సంచరించడంవల్ల ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం మూడు రాశులవారిపై ఉంటుంది. ఈ నెల 16న ఏర్పడే శుక్రాదిత్య రాజయోగంవల్ల లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
అనుకున్న పనుల్లో చాలా సులువుగా విజయాలు సాధిస్తారు. శుక్రాదిత్య రాజయోగం వీరికి అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఆటంకాలు తొలగిపోతాయి. విపరీతమైన లాభాలు పొంది ఆర్థికంగా సుఖపడతారు. స్థిరపడతారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

మకర రాశి
ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఈ రాశివారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభించి పనితీరులో మంచి నైపుణ్యాన్ని కనపరుస్తారు. అలాగే వీరికి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి అనేక లాభాలున్నాయి. కఠినమైన పనులను కూడా ఎంతో సులువుగా చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
వృశ్చిక రాశి
గతంలో మొదలై అలాగే నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగాలు చేసేవారికి దూర ప్రయాణాలున్నాయి. అంతేకాదు వీరు పదోన్నతికి అర్హులవుతారు. వేతనం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకున్న పనుల్లో సులువుగా విజయాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ప్రశాంతత కలుగుతుంది.












Click it and Unblock the Notifications