ఈ రాశులను గట్టిగా పట్టుకున్న అదృష్టం.. వదలడంలేదు
వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సంపదకు, లగ్జరీ జీవితానికి కారకుడు శుక్రుడు. బృహస్పతి తర్వాత అత్యంత శుభప్రదమైన గ్రహం శుక్రుడు. ఒక రాశి నుంచి మరోరాశిలోకి సంచారం చేయడానికి శుక్రుడు 23 రోజుల సమయం తీసుకుంటాడు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే జాతకంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండాలి. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడికి ఇష్టమైన రాశులు, ఆయనవల్ల కలిసివచ్చే రాశుల వివరాలు తెలుసుకుందాం.
తులారాశి
తులారాశివారికి శుక్రుడి సంచారం అనేక లాభాలను తెచ్చిపెడుతుంది. నైపుణ్యం పెరగడంతో మంచి అవకాశాలు తలుపుతడతాయి. కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంవల్ల వ్యాపారం ప్రారంభించడంతోపాటు తెలివితేటలతో వాటిని విస్తరింపచేస్తారు. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఉన్నతస్థాయికి ఎదుగుతారు.

వృషభ రాశి
జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తుంటారు. ఈ సమయంలోనే నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రతి పనిలోను విజయం సాధిస్తారు.
మీన రాశి
శుక్రుడికి ఈ రాశి అంటే మహా ఇష్టం. ఆరోగ్యం బాగుంటుంది. జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి అమలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ పరంగా సంతోషం వెల్లవిరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications