వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
సంపదకు, కీర్తికి, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు అతి త్వరలోనే రాశి సంచారం చేయనున్నాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులవారిపై ఉంటుంది. జూన్ 12వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశించనుంది. ఆ ప్రభావంతో విపరీతమైన ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వృషభరాశిలోకి సంచారం చేయడంవల్ల సూర్యుడితో కలయిక జరిగి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభ రాశి
లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా లాభపడతారు. విపరీతమైన డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు భారీగా ఖర్చవుతాయి. మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు. వ్యాపారాల కోసం చాలామంది సంప్రదిస్తారుకానీ అటువంటివేమీ లేకుండా సొంత ప్రయత్నాలతో రాణిస్తే ఉన్నత స్థాయికి చేరుకునే భాగ్యం కనపడుతోంది.

కర్కాటక రాశి
వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల ధనలాభాలున్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనులను పూర్తిచేసేవారు బాగా రాణిస్తారు. వారికి జీవిత భాగస్వామి మంత్రిగా పనిచేస్తారు. సలహాలు కూడా మంత్రుల స్థాయిలో ఉంటాయి.
మకర రాశి
శుక్రుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కెరీర్ కు సంబంధించి లాభాలు పొందుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఒంటరి జీవితం గడుపుతున్న వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా ఆర్థికంగా లాభపడతారు.












Click it and Unblock the Notifications