రెండు రోజుల్లో వీరికి మహారాజయోగం పట్టబోతుంది...శుక్రుడి శాసనం!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి ఒక స్థానం ఉంటుంది. నవ గ్రహాలలో శుక్రుడికి కూడా చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి, ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి సంచారం చేస్తాడు.ఆగస్టు 21వ తేదీన శుక్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
కర్కాటక రాశిలోకి శుక్రుడు
శుక్రుడిని సంపదలకు, విలాసాలకు, సౌఖ్యానికి, వైవాహిక జీవిత ఆనందానికి, కీర్తి, కళలు, అందం మొదలైన వాటికి అధిపతిగా చెబుతారు. అటువంటి శుక్రుడు కర్కాటక రాశిలోకి వెళుతున్న సమయంలో కొన్ని రాశుల వారిని కరుణిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి ఆగస్టు 21వ తేదీన సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి శుక్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మేషరాశి వారు చేసే పనులలో వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాల పురోగతికి అవకాశం ఉంది. మేష రాశి వారి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వైవాహిక జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. సహోద్యోగులు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.
వృశ్చిక రాశి
శుక్ర సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చాలా కష్టసాధ్యమైన పనుల్లో సైతం విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి అన్ని విధాల లబ్ధిని చేకూరుస్తుంది.
మకర రాశి
శుక్ర సంచారం మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారు వర్తక వ్యాపారాలు చేసే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది ఈ సమయంలో ఉన్నతాధికారుల సహకారాన్ని పొందుతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. అన్ని విధాలా ఇది మకర రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications