శని తిరోగమనంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకునే రాశులవారు వీరే!
జ్యోతిష శాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిని కర్మ దేవుడిగా, న్యాయ దేవుడిగా చెప్తారు. అటువంటి శని దేవుడు జులై మాసంలో తిరోగమన సంచారం చేయనున్నాడు. శని తిరోగమన సంచారం జులై 13న ప్రారంభం అవుతుంది. శని తిరోగమన సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. శని తిరోగమన సంచారం ఫలితంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
శని తిరోగమన సంచారం వృషభ రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా నెగటివ్ రిజల్ట్స్ చూస్తారు. పని చేసేటప్పుడు ఆచి తూచి వ్యవహరించటం అవసరం. వృషభరాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మిధున రాశి
శని తిరోగమన సంచారం కారణంగా మిధునరాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మిధునరాశి వారు పనులు పూర్తి కాకపోవటం వలన నిరాశ చెందుతారు. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు రావు. ఉద్యోగులు అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయం మీకు ఎలాంటి పెద్ద ప్రయోజనాలను చేకూర్చదు. మీరు మీ పనిలో ఆలస్యాన్ని లేదా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
సింహరాశి
శని తిరోగమన సంచారం కారణంగా సింహరాశి వారు అనేక కష్టాలను పడవలసి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం గురించి అసలు నిర్లక్ష్యం వహించకూడదు. కుటుంబ సంబంధిత విషయాల్లో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మంచి ఫలితాలు రాకపోవచ్చు. ఒకవేళ మీరు మంచి ఫలితాలు పొందాలంటే చాలా కష్టపడాలి.
మీనరాశి
శని తిరోగమన సంచారం కారణంగా మీనరాశి వారికి ఇబ్బందులు రాబోతున్నాయి. మీనరాశి వారు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఆశించరాదు. ప్రతికూల ఆలోచనలకు మీనరాశి వారు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డబ్బు విషయాల్లో మీనరాశి వారు అజాగ్రత్తగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరించండి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications