దరిద్ర యోగాన్ని తెస్తున్న శుక్రుడు.. ఈ రాశువారు ఇంట్లో పడుకోవడమే

శుక్రుడికి బలహీనమైన రాశి కన్యా రాశి. ఈ రాశిలోకి 25వ తేదీన సంచారం చేస్తాడు. సంపదకు, విలాసాలకు, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడు కన్యారాశిలోకి వస్తూ దరిద్ర యోగాన్ని తెస్తున్నాడు. ఈ సంచారం వల్ల ఏర్పడే ఈ యోగంవల్ల కొన్ని రాశులవారికి కష్టాలతోపాటు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. వ్యక్తి జాతకంలో శుక్రుడు స్థానాన్ని బట్టి ఇది ఏర్పడుతుంది. బృహస్పతి 6, 12 ఇంట్లో ఉంటే జాతకంలో దరిద్ర యోగం సంభవిస్తుంది. ప్రధానంగా మూడు రాశులవారు దీనివల్ల ప్రభావితం కానున్నారు. కొన్నిరోజులపాటు వీరంతా ఎంతో జాగ్రత్తగా ఉండటంతో పాటు నిత్యం భగవంతుణ్ని ఆరాధించడంవల్ల కష్టాల నుంచి బయటపడతారు.

కర్కాటక రాశి
దరిద్ర యోగం వల్ల ఈ రాశివారు తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువై మనశ్శాంతిని కోల్పోతారు. వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోవడంతో కష్టాలు చుట్టుముడతాయి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు చుట్టుముడతాయి. డబ్బుల కొరతవల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకుంటాయి.

these zodiac signs will face somany problems due to venus transit create daridra yoga

మేషరాశి
ఈ రాశివారి డబ్బు ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. ఉద్యోగాలు చేస్తున్నవారు వారు పనిచేసేచోట ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. లేదంటే అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండటంతో జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంగారకుడివల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మూడో ఇంట్లో ఉంటారు. అలాగే ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి.

మకర రాశి
ఈ నెలలో మకర రాశివారు సమస్యలపాలవుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వైవాహిక జీవితంలో ఉన్నవారు జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోకపోతే సమస్యలపాలవుతారు. ప్రయాణాలు చేసే సమయంలో కూడా అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట సమస్యలను ఎదుర్కొంటారు. వీరి పనితీరువల్ల వేరేవారు ప్రశంసలు అందుకుంటారు. కొందరు కుట్ర చేయడానికి కూడా అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+