గజకేసరి యోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగాన్నిస్తున్న కుబేరుడు
అన్ని గ్రహాల్లోకెల్లా కీలకమైన గురుడు అన్ని రాశుల్లో సంచారం చేయడానికి 12 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. బృహస్పతి తాజాగా వృషభరాశిలోకి ప్రవేశించాడు. డిసెంబరు 22న చంద్రుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఇది ఎంతో శక్తివంతమైన గ్రహమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ యోగంవల్ల ఏయే రాశులకు ఎంత శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. జాతకంలో గజకేసరి యోగం శుభస్థానంలో ఉంటే వీరిని అదృష్టం గట్టిగా పట్టుకుంటుంది.
కుంభరాశి
కుటుంబ జీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలోనే దూరమవుతాయి. భూమికి సంబంధించి కొద్ది సంవత్సరాలుగా ఎదురవుతున్న సమస్యలు కూడా ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. అలాగే ఊహించనిరీతిలో వీరికి ధనలాభం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది.

మేషరాశి
ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలతోపాటు వేతనాలు పెరుగుతాయి. అలాగే ప్రమోషన్లు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు లాభాలనిస్తాయి.
కన్యారాశి
ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతోపాటు ఆర్థికంగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications