మే నెలలో ఈ రాశులవారింట కాసుల పంట!
నవగ్రహాలు వేటికవే ప్రత్యేకం. 9 గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం పడుతుంది. నవగ్రహాలలో రాహువుకు నీడ గ్రహంగా, చెడు చేసే గ్రహంగా పేరుంది. ఇదే సమయంలో రాహువు ఉచ్చ స్థితిలో ఉంటే కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.
కుంభరాశిలోకి తిరోగమన సంచారం
సహజంగా రాహువు, కేతువులు తిరోగమన సంచారమే చేస్తారు. చాలా నిదానంగా కదులుతాయి. ప్రస్తుతం రాహువు మే 2025 లో నుంచి కుంభరాశి లోకి తిరోగమన సంచారం చేయబోతున్నాడు. కుంభ రాశిలో రాహువు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తోంది. మరి రాహువు కారణంగా సానుకూల ఫలితాలను పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి వారికి రాహువు సంచారం కారణంగా ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారు మంచి పురోగతిని సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరం ముందుకు వెళతారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి రాహువు సంచారం కారణంగా కలిసి వస్తుంది. 2025 సంవత్సరం మే నెలలో రాహువు కుంభరాశిలో సంచరించడం వల్ల కన్యారాశి జాతకులకు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయంలో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
ధనుస్సు రాశి
రాహువు సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి మే నెల నుండి కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు రాగా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థులు చదువులో రాణించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications