కుజుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశులకు అద్భుతమైన యోగం
30 సంవత్సరాల తర్వాత అంగరాకుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే ఈ రాశిలో శని, శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ కలయిక మూడు రాశులకు సంపదను తెచ్చిపెడుతోంది. శుక్రుడు సంపదను ఇస్తాడు. శుక్రుడు, కుజుడు కలిసినప్పుడు శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీన్ని ధనశక్తి యోగంగా పరిగణిస్తారు. వచ్చేనెల 22వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు. వీటి కలయికవల్ల మేలు పొందుతున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా చేసే పనుల వల్ల అందరినుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారంలో వృద్ధి చెందడానికి కొత్త అవకాశాలు తలుపుతడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆదాయానికి అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.

తులా రాశి
శారీరకంగా సౌఖ్యం పెరుగుతుంది. చేస్తున్న పనికి సంబంధించి విదేశీ ప్రయాణం చేస్తారు. వ్యాపార పరిస్థితి బలంగా మారుతుంది. డబ్బును ఆదాచేయాలి. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థికంగా బలోపేతమవుతారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మకర రాశి
పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్య, మేథోపరమైన పనులపై ఆసక్తిని చూపిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది.
కుంభ రాశి
ఈ రాశివారికి అదృష్టం పెరుగుతుంది. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థలం లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి వాటిని పూర్తిచేస్తారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలు చేపడతారు.












Click it and Unblock the Notifications