2025 ఫిబ్రవరి నుండి వీరికి కుబేరయోగం.. మా మాటే తధ్యమన్న శని సూర్యులు!

నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం. ఇక శని గ్రహం అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తారు. శని కర్మలకు అధిపతి కాబట్టి మనం చేసే కర్మలను బట్టి వాటి ఫలితాలను తప్పకుండా శని ఇస్తాడు. ముఖ్యంగా మార్గశిర మాసంలో శనీశ్వరుని విశేషంగా పూజించాలని చెబుతారు.

2025 ఫిబ్రవరిలో శని సూర్యుల సంయోగం
ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడేవారు కొన్ని పరిహారాలను పాటించి, శని బాధల నుంచి విముక్తి పొందాలని కూడా చెబుతారు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక 2025 సంవత్సరం ఫిబ్రవరిలో సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శని కుంభరాశిలో ఉన్న కారణంగా కుంభరాశిలో సూర్యుడు శని సంయోగం జరుగుతుంది. దీంతో 2025 ఫిబ్రవరి మాసం నుండి కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

These zodiac signs will have Kubera Yoga from February 2025 with sun and saturn conjunction

మేష రాశి
2025 సంవత్సరంలో శని సూర్యుల సంయోగం కారణంగా ఫిబ్రవరి మాసం నుండి మేషరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెట్టే పెట్టుబడులు మంచి పురోగతిని ఇస్తాయి. మేష రాశి వారి వైవాహిక జీవితం ఈ సమయంలో సంతోషదాయకంగా ఉంటుంది.

సింహరాశి
2025 సంవత్సరంలో సింహ రాశి వారికి శని సూర్యుల సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది. సింహరాశి జాతకుల వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహమయ్యే అవకాశం ఉంది. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింహ రాశి వారికి ఇది అన్ని విధాలుగా కలిసి వచ్చే సమయం.

ధనుస్సు రాశి
2025 సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరిని కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసినా ఈ సమయంలో రెట్టింపు లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+