జులై 28 వరకు షడష్టక యోగంతో ఈ రాశుల సుడి తిరుగుతుంది!

వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలసంయోగం కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. 2025జూన్ మాసంలో కుజుడు కేతువు సంయోగం ఏడవతేదీన ప్రారంభమై జులై 28వ తేదీవరకు కొనసాగుతుంది. కుజుడు కేతువు సంయోగంతో ఏర్పడిన షడష్టకయోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. కుజ కేతు గ్రహాలు ఆరు రాశుల దూరంలో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా జులై 28వ తేదీవరకు అదృష్టాన్ని పొందుతున్న రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారి పాలక గ్రహం కుజుడు కాబట్టి కుజ కేతువుల కలయికతో ఏర్పడే షడష్టక యోగం మేష రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఇది మీ ఐదవ గృహాన్ని పెంచే శక్తితో ముడి పడి ఉన్న కారణంగా మేషరాశి వారు ఈ సమయంలో ఉత్సాహంతో ఉంటారు. ఏ పని చేసినా సానుకూల ఫలితాలు పొందుతారు.

These zodiac signs will shine and get wealth with Shadashtak Yoga until July 28th

సింహరాశి
కుజ కేతువుల సంయోగంతో ఏర్పడే షడష్టక యోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. ఈ సమయంలో సింహరాశి వారి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించటానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో ఆచి తూచి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి.

కన్యా రాశి
కుజ కేతువుల సంయోగంతో ఏర్పడే షడష్టక యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఆర్ధిక విజయాలను సాధించటానికి అవకాశం ఉంది. కుజ, కేతువుల కలయిక కారణంగా మీ పదకొండవ ఇల్లు బలపడుతుంది. ఇది మీ పురోగతికి దోహదం చేస్తుంది. ఉద్యోగం చేసే వారికి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి షడష్టక యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా సానుకూల ఫలితాలు పొందుతారు. కుజ కేతువుల కలయిక వృశ్చిక రాశిలో పదవ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ఎంతో కాలంగా మీరు చేసిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఇది వృశ్చిక రాశి వారికి సానుకూల సమయం.

మకర రాశి
మకర రాశి వారికి కుజ కేతు సంయోగం కారణంగా ఏర్పడే షడష్టక యోగం తో మంచి జరుగుతుంది. ఇది మకరరాశిలో ఏడవ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో వర్తక, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఏ పని చేసినా మకర రాశి జాతకులకు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలోనూ మీరు ఎదగటానికి ఇది మంచి సమయం.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+