రాసిపెట్టుకోండి.. త్వరలో కుజ పుష్య యోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు పుష్య నక్షత్రాన్ని కలిపే జ్యోతిష్య అమరిక త్వరలో జరగబోతోంది.ప్రస్తుతం కుజుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6:30కు కుజ పుష్య యోగాన్ని కుజుడు ఏర్పరుస్తున్నాడు. కుజుడు పుష్య నక్షత్రంలోకి వెళ్లి అరుదైన శక్తివంతమైన కుజ పుష్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.
కుజ పుష్య యోగం
కుజ పుష్య యోగం వల్ల కొన్ని రాశుల వారికి శ్రేయస్సు, సంపదలు వస్తాయి. ఈ అరుదైన ఖగోళ యాధృచ్చికం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే కుజ పుష్య యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
పుష్య నక్షత్రంలో కుజ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపార ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. పుష్య నక్షత్రంలో కుజసంచారం కారణంగా వృషభ రాశి వారికి సంపద వస్తుంది. వ్యక్తిగత పురోగతి కలుగుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత ఈ సమయంలో సాధ్యమవుతుంది.
కర్కాటక రాశి
కుజపుష్య యోగం కారణంగా కర్కాటక రాశిలో ఉన్నవారికి లబ్ది జరుగుతుంది. కర్కాటక రాశిలో లగ్న గృహంలో కుజుడు ఉండడంతో ఈ సమయం వారికి అదృష్టాన్ని తెస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి రాబడి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయం శ్రేయస్సును, సంపదను ఇస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి మంచి సమయం.
కన్యారాశి
కన్యారాశిలో జన్మించిన వారికి కుజపుష్య యోగం కారణంగా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు గణనీయమైన పురోగతిని చూస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలోని అనేక రంగాలలో సంపన్నమైన సంతృప్తికరమైన సమయాన్ని చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications