ఆషాఢంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు అఖండ రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అద్భుతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి మనిషికి వ్యక్తిగత జీవితంలో ఎంతో మంచిని చేకూరుస్తాయి. ఆకస్మిక ధనలాభంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం జరుగుతుంటుంది. ఆషాఢ మాసంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల వృషభం,కన్య, సింహం, మీన రాశులకు ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
వీరికి ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. న్యాయపరమైన విషయాల్లో న్యాయస్థానాల్లో విజయం దక్కుతుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం. డబ్బులకు సంబంధించి పొదుపు చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చేలా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది.

కన్య రాశి
కన్యారాశివారికి ఆషాఢ మాసం మొత్తం కలిసివస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు రాణిస్తారు. అలాగే కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. అనుకున్న పనులను సులభంగా పూర్తిచేయడంతోపాటు ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.
సింహ రాశి
గజకేసరి యోగంవల్ల ఆషాఢ మాసంలో సింహరాశివారికి డబ్బుల వర్షం కురుస్తుందంటే అతిశయోక్తికాదు. ఉద్యోగస్తులకు పదోన్నతితోపాటు వేతనం కూడా పెరుగుతుంది. అనుకోకుండా మంచి స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులకు మీవల్ల ఎన్నోరకాల ప్రయోజనాలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.
మీనరాశి
చాలా దగ్గరి వ్యక్తులతో వివాహం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టిన ప్రతి రూపాయి రెండింతల నుంచి మూడింతల వరకు సంపాదిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రత్యర్థులుగా భావించేవారు సైతం మిత్రులుగా మారి మంచి సహాయాన్ని అందిస్తారు. ఆషాఢ మాసంలో వీరికి అఖండ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
ఈ నాలుగు రాశులవారు మంచి ఫలితాలను సాధించేందుకు ప్రతిరోజు రావిచెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయడంతోపాటు చీమలకు పంచదారను, బెల్లాన్ని తినేందుకు పెడుతుండాలి. పేదలకు వస్త్రదానంతోపాటు అన్నదానం కూడా చేస్తే సత్వరమే మంచి ఫలితాలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications