ఎల్లుండి నుంచి ఈ రాశుల దశ, దిశ మారబోతున్నాయి

జ్యోతిష్యం ప్రకారం ఎంతో ప్రధాన గ్రహమైన అంగారకుడు ఈనెల 12వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడి నుంచి ఆగస్టు 26న మిథునరాశిలోకి సంచారం చేస్తాడు. ఈ మధ్యకాలంలో జరిగే సంచారంవల్ల ఎవరి జాతకంలో అయితే కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి అదృష్టం అన్నివైపుల నుంచి పట్టుకుంటుంది. కొన్ని బంగారు అవకాశాలు తలుపు తడతాయి. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.

సింహరాశి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేవారికి మంచి అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా చేస్తారు. కొత్త ఇంటితోపాటు కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులకు మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని భార్యాభర్తలిద్దరూ చవిచూస్తారు.

these zodiac sings very lucky due to mars transit 2024 july

కన్యా రాశి
అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికంగా బలపడతారు. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను అప్పజెబుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు అందుబాటులోకి రావడమే కాకుండా డబ్బును పొదుపు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నవారి కోరికలు నెరవేరతాయి.

వృశ్చిక రాశి
కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి. ఈ నెల మొత్తం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు. వాహనాలను కొనుగోలు చేయడంతోపాటు ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ చివరకు మీకే విజయం దక్కుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేయడంతోపాటు గృహాలను కూడా కొనుగోలు చేస్తారు.

మీనరాశి
అనుకున్న పనిని సులువుగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఎదురవుతున్న చిక్కులను పూర్తిగా తొలగించుకోవడమే కాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. ఎంతో ధైర్యంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఉద్యోగం మారాలని చూస్తున్నవారి కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. కంటున్న కలలను నెరవేర్చుకోవడానికి ఇది శుభ సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+