ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశులకు అదృష్టం పట్టుకుంది
గ్రహాల రాకుమారుడైన బుధుడు తెలివి తేటలకు, సమాచారానికి, మంచి మాటతీరుకు, జ్ఞానానికి కారకుడు. ఈనెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం పుష్య నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల మొత్తం 12 రాశులవారికి శుభ, అశుభ ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం మంచి ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. బుధుడు ఆశ్లేషలో ఉండటంవల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఏ రాశులవారికి బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
వీరి వ్యాపార పరిస్థితి బాగుంటుంది. బలపడుతుంది. ధన ప్రవాహం పెరగడంతోపాటు విద్యకు సంబంధించిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. మాటల్లో మాధుర్యం తొణికిసలాడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది.

సింహ రాశి
ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరగడంతోపాటు ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. మాటలో సౌమత్య తొంగిచూస్తుంది. దూర ప్రయాణాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. జీవనశైలి బాగుంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
తులా రాశి
అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు కెరీర్ కు సంబంధించి విజయాలు నమోదు చేస్తారు. పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు. సాదాసీదాగా జీవితాన్ని గడుపుతారు. పెద్దలపట్ల ఎంతో వినయంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంది. జీవితంలోని ప్రతి రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది.
ధనుస్సు రాశి
ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో కూడా మంచి పురోగతిని నమోదు చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతోపాటు అన్నివైపుల నుంచి ధనం వస్తుంది. పనిచేసేచోట పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు. ప్రతి పనికి మీరు ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి.












Click it and Unblock the Notifications