బుధుడి త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు అన్నీ అద్భుతాలే
ఈనెల తొమ్మిదోతేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనికి అధిపతి గురువు. అప్పటికే అక్కడ సూర్యుడు, శుక్రుడు ఉన్నారు. బుధుడి ప్రవేశంతో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల మూడు రాశులవారి జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ఆ రాశులవారికి ఏ విధంగా కలిసిరానుంది? తదితర వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి పటిష్టమవుతుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవడమే కాకుండా వారి సలహా సూచనలతో చేసిన పనులన్నీ విజయవంతమవుతాయి.

మిధునరాశి
త్రిగ్రాహి యోగంవల్ల ఈ రాశివారికి మంచి లాభాలు కలగనున్నాయి. వేతనం భారీగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా ఉంది. వ్యాపారస్తులు ఎన్నడూ కళ్లచూడని లాభాలను చూస్తారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
మకరరాశి
త్రిగ్రాహి యోగం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కార్యాలయంలో తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. వివాహం కానివారికి సంబంధాలు వస్తాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఎప్పటినుంచో వేధిస్తున్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేయడానికి, తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి అనుకూలమైన సమయం.












Click it and Unblock the Notifications