రేపటినుంచే ఈ రాశులకు మహర్దశ
నవంబరు నెలలో శుక్రుడు, శని, బుధుడు, కుజుడుతో పాటు సూర్యుడు కూడా సంచారం చేయబోతున్నాడు. నవంబర్ 4వ తేదీ ఉదయం 4:58 గంటలకు కన్యారాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి సంపద, ఐశ్వర్యం కలగనున్నాయి. ఏయే రాశులనే వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి:ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమ జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

వృషభ రాశి:జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం బలోపేతమవుతుంది. అధిక సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికే వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు బాగుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు లభిస్తాయి.
మిథునరాశి:శుభవార్తలను వింటారు. మాటతీరు ఎంతో బాగుంటుంది. దీనివల్ల ఎదుటివారు మీ మాటలకు కట్టుబడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంవల్ల భవిష్యత్తులో అంతా శుభమే జరుగుతుంది.
కర్కాటక రాశి:విజయాలు సాధించేందుకు అవసరమైన శక్తిని పొందుతారు. లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.
సింహ రాశి:వీరి వ్యక్తిత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయి. మాటతీరు కారణంగా వీరు ఎదుటివారిని ఆకట్టుకుంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంవల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఒత్తిడి నుంచి సులువుగా బయటపడతారు.
వృశ్చిక రాశి:శుక్రుడి సంచారం వీరికి కలిసివస్తుంది. ప్రేమ జీవితాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. ఆర్థికంగా మెరుగుపడటంతోపాటు విభిన్న ప్రయోజనాలను కూడా పొందుతారు.
మకర రాశి:కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. శాంతి నెలకొంటుంది. ప్రేమ సంబంధాలు మరింత దృఢమవుతాయి. జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకోవడానికి అవసరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications