12ఏళ్ళ తర్వాత శక్తివంతమైన గజకేసరి రాజయోగంతో వీరికి మహారాజయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో గురు చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. 12ఏళ్ళ తర్వాత డిసెంబర్ మాసంలో ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల 38 నిమిషాలకు బృహస్పతి మిధున రాశిలో తిరోగమనం చెంది, 2026 జూన్ రెండవ తేదీ వరకు అక్కడే సంచరిస్తాడు. ఇక అదే రోజు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు చంద్రుడు కూడా మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.
గజకేసరి రాజయోగం
ఈ గురు చంద్రుల సంయోగం కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది దాదాపు 54 గంటల పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎవరు ఏ పనులు చేపట్టిన శుభప్రదంగా ఉంటుంది. ఈ గజకేసరి రాజయోగం కారణంగా డిసెంబర్ మాసం అంతా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి గురుడు, చంద్రుడు కలయిక వలన ఏర్పడిన గజకేసరి రాజయోగం తో అదృష్టం కలిసి వస్తుంది.. ఈ రాశిలో గురువు సప్తమ, దశమ స్థానాలకు అధిపతిగా ఉండి లగ్న స్థానంలో సంచరించడం వల్ల ఈ సమయం వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. విదేశీ వనరుల నుండి వీరికి లాభాలు వస్తాయి.
తులారాశి
డిసెంబర్ మాసంలో ఏర్పడే గజకేసరి రాజయోగం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. తులారాశిలో దశమ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. తులా రాశి జాతకులకు ఈ సమయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ ప్రాజెక్టులు చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది.
కుంభరాశి
గజకేసరి రాజయోగం కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి ప్రభావంతో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు సంతోషంగా జీవిస్తారు. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.
మీన రాశి
గజకేసరి రాజయోగం కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు. గురుడు మరియు చంద్రుడు కలయిక వలన ఏర్పడే గజకేసరి రాజయోగం వీరికి విశేష ప్రయోజనాలను చేకూరుస్తుంది. గురుడు పంచమ స్థానంలో, నాలుగవ స్థానంలో తిరోగమనంలో సంచరించడం వల్ల వీరి కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది.












Click it and Unblock the Notifications