శ్రావణం.. సూర్య గ్రహణంపై అసత్య ప్రచారం, నిజం ఏమిటి?
ముఖ్యంగా తాయెత్తులు, రాళ్ళు అమ్ముకునే వాళ్ళు లాభాపడదామని అనుకుంటున్నారు.
21.08.2017 నాడు సూర్య గ్రహణం లేదు నియమాలక్ఖరలేదు
(అబద్ధాలను నమ్మకండి)
మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలలో ఇది ఒకటి అని గుర్తించండి.
వివరణ:
శ్రావణ మాసంలో - అమావాస్య - సోమవారంనాడు రావడం జరిగింది. సోమవారం ఇలా రావడం కొన్నివేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కొన్ని కోట్లరెట్ల పుణ్య ఫలితం వస్తుంది అని వాట్సప్ లలో, ఫేస్ బుక్ లలో ఇంటర్నెట్ లలో, కొన్ని టీవీలలో బాగా ప్రచారం చేస్తున్నారు.

ముఖ్యంగా తాయెత్తులు, రాళ్ళు అమ్ముకునే వాళ్ళు లాభాపడదామని అనుకుంటున్నారు. ఇంకా ఆరోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అని అదికూడా సామాన్యమైనది కాదు రెండువేల సంవత్సరాల తరువాత వచ్చే గొప్ప యోగం అని వాగుడుగా అదరగొడుతున్నారు.
నిజం ఏమిటి?
ముందుగా సూర్యగ్రహణం - సూర్యగ్రహణం ఉంది, కానీ భారతదేశములో కాదు, కనపడదు. నార్త్ అమెరికా, అట్లాంటిక్ సముద్ర ప్రాంతములయందు కనపడుతుంది. భారతదేశములో కనపడదు. మరి కనపడని గ్రహణములు ఫలితములు కూడా ఉండవు, ఎలాంటి నియమాలు పారించవలసిన అవసరం లేదు అనేది శాస్త్ర వచనం.
మరొకటి శ్రావణ అమావాస్య సోమవారం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అట. ఇది కూడా తప్పుమాట. అలా ఏమీలేదు గత 50 సంవత్సరాలలో పరిశీలిస్తే
1943 లో, 1946లో, 1960 లో,
1963 లో, 1967 లో, 1990 లో,
1994 లో, 1997 లో, 2004 లో,
2011 లో, 21-8-2017 ఈ సంవత్సరాలలో అమావాస్య
కృష్ణ అమావాస్య సోమవారములలో వచ్చినవే.
కాబట్టి అన్నివేల వేల సంవత్సరాలకు వచ్చే గొప్పయోగం అని పూజలు శాంతులు చేసుకోండి అని దానాలు ఇవ్వమని చెప్పే అబద్దాలని నమ్మి మోసపోకండి.
ఎవ్వరికి దోషము, దానము, పరిహారములు చేసుకునే పనిలేదు. చేయకండి.
పనికిమాలిన ప్రచారాల్ని, అసత్యాలను ఖండించండి. నాలుగు సార్లు టివిలో కనబడ్డవాళ్ళు చెప్పే మాటలతో వాళ్ళని గొప్ప పండితులని నమ్మటము వలన మోసపోయి చివరకి శాస్త్రముపైన, మన హైందవ ధర్మముపైన నమ్మకము పోయి. వ్యతిరేకులు దైవదూషణ చేసే వాళ్ళు తయారవుతున్నారు.
అలా జరగా కుండా పదిమందికి ఈ నిజాన్ని ప్రచారం చేయండి.












Click it and Unblock the Notifications