ఈ వారం ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే!
ఏప్రిల్ 13-19 వరకు వారంలో, కొన్ని రాశుల వారికి అనేక గ్రహాల సంచారాలు, గ్రహాల కలయికలు సానుకూల ఫలితాలను తెస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 16 న బుధుడు నెప్ట్యూన్ దగ్గర ఉంటాడు. ఇక నేడు ఏప్రిల్ 13వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రత్యక్షమయ్యాడు. శుక్రుడు మీన రాశిలో ప్రత్యక్షం కావడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
ఈ వారం లక్కీ రాశులివే
అలాగే రేపు మేష రాశిలోకి సూర్యుడు సంచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది కూడా కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ విధంగా ఈ వారంలో జరిగే గ్రహాల సంచార ఫలితంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ముఖ్యంగా, వృషభం, సింహ, మీనం మరియు మిథున రాశి వారు గ్రహాల సంచారం కారణంగా ప్రయోజనాలను పొందబోతున్నారు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈ వారంలో జరిగే గ్రహాల మార్పుల కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీరు మెరుగైన సంబంధాలతో సంతోషంగా జీవిస్తారు.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈవారం సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. మిధున రాశి జాతకులు కెరీర్లో పురోగతిని సాధిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఇంక్రిమెంట్ లను తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. వివిధ గ్రహాల సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది .. అత్యంత ప్రతిష్టాత్మకంగా, దృఢ నిశ్చయంతో సింహరాశి జాతకులు ముందుకు సాగుతారు. వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మీనరాశి
మీనరాశి జాతకులు ఈ వారంలో జరిగే గ్రహాలు మార్పు కారణంగా కొన్ని ప్రయోజనాలను పొందుతున్నారు. రకరకాల సవాళ్లు ఉన్నప్పటికీ మీనరాశి వారి సృజనాత్మకత ఈ సమయంలో పెరుగుతుంది. వారి లక్ష్యాల వైపు పురోగతి ఉంటుంది. ఇది మీన రాశి వారికి అన్ని విధాల లబ్ధిని చేకూర్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications