జనవరి 1న మహా రాజయోగాలు... ఏడాది పొడవునా ఈ రాశులకు అఖండ ధనయోగం
మరో వారం రోజుల్లో ఇంగ్లిషు పాత సంవత్సరం ముగియబోతోంది. ఆంగ్ల సంవత్సరం కొత్తది రాబోతోంది. కొత్త ఏడాదిలో కలిసివస్తుందనే నమ్మకంతో మొత్తం ద్వాదశ రాశులవారు ఆశగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు జనవరి 1వ తేదీన మాలవ్య రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈ కలయిక మొత్తం నాలుగు రాశులవారికి అనేక శుభ ఫలితాలను కలిగిస్తోంది. గ్రహాల రాకుమారుడు బుధుడివల్ల ఈ యోగాలు ఏర్పడుతున్నాయి. మొత్తం నాలుగు రాశులవారు దీనివల్ల లాభపడుతున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
తులా రాశి
ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బులు ఈ సమయంలోనే మీ చేతికి తిరిగి అందుతాయి. వాటిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన విషయాల్లో మీరు విజయాలను అందుకుంటారు. ఇంటికి అతిథులు వస్తారు. వారిని బాగా ఆదరించండి. దీనివల్ల మీకు బాగా కలిసివస్తుంది.

కుంభ రాశి
బుధుడి అనుగ్రహంతో ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. విద్యనభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి ఈ సమయం కలిసివస్తుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లివస్తారు. డబ్బును పొదుపు చేయడంలో అప్రమత్తత తీసుకోవాలి. లేదంటే పడిన కష్టం వృథా అయ్యే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు.
మేష రాశి
ఈ రాశివారికి కొత్త సంవత్సరంలో ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. దాంతోపాటు పెరిగిన వేతనం అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే సమయంలో గురువు సలహా తీసుకోవాలి. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఖర్చులను నియంత్రించుకుంటే పొదుపు చేసిన డబ్బులే మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాయి.












Click it and Unblock the Notifications